Sunday, February 19, 2012

ఉగ్రవాదం అశాశ్వితం ..సన్మార్గం శాశ్వితం…WTC Brothers.



నింగికి తలమానికంగా వున్న నన్ను నేలమట్టంచేసారు..!
ఎంతోమంది అమాయకులు ప్రాణాలు ను బలితీసుకొన్నారు..!
కాలెండర్ లో నాకు ఒక రోజును సృష్టించారు ..!
ఇక్కడ సంతాపం సానుభూతి మా పై మాత్రమే ..!
మీపై ద్వేషం పగ ,ప్రతీకారం మాత్రమే..!
నేను కాంక్రీట్ దిమ్మను .. నా పై కరుణ చూపుతున్నారు
ప్రాణం లేని నన్ను ప్రాణిగా మార్చ్హారు ..!
నేను ఇక్కడే అందరి మనసుల్లో .. నన్ను నాశనం చేసిన మీరెక్కడ ?
అంతం ఉన్మాదానికే..!నా ఉనికి ప్రపంచమంతా ..!
కనీసం మిమ్మల్ని కన్నవారికైనా మీ పై జాలి దయ వుండదు..!
నన్ను కట్టినవారు నా నిర్మాణం మరింత దృడం గా చేస్తున్నారు .. ..
మరి మీ నాయకుడెక్కడ..? అతని అస్తికలు ఎక్కడ?
మనిషిని మనిషిని చంపడం మృగలక్షణం ..!
ప్రేమించడం మానవలక్షణం..!
నేను జీవిని కాక పొయినా మీ పై జాలి పడుతున్నా ..మీ తదనంతరం వారైనా మారాలని కోరుతూ ..

దినేబ్బా జీవితం...!


దినేబ్బా జీవితం ప్రతి ఒక్కరూ నా తోకగురించే ...కామెంట్స్ ..అది సక్కగుంటే ఏం ...?వంకరగుంటే ఏం ..? కుక్క ని కదా అని ప్రతివానికి అలుసైపొయింది
మనుషులూ ..మీ బుద్ది వంకర ..మీరు చేసే పనులు వంకర ,మీరు నడిచే దారి వంకర ,టింకర ..పెద్ద సెప్పోచ్చారు నీతులు...కుక్క తోక వంకరని ..!

సినిమా కష్టాలూ కామెడీగా

చూసి చూసి కళ్ళు కాయలాయా ...(సినిమాలు )
విని విని చెవులు చేటలాయా.. (సంగీతం)
రాసి రాసి పెన్నులో ఇంకు అవిరాయా ..
చెప్పి చెప్పి కథలు కంచికిబోయా ...
తిరిగీ తిరిగీ కాళ్ళు అరిగిపోయా ..
అవకాశం ఆమడాయా..మనసు కుదేలాయా..
బ్రతుకు భారమాయా...కలలు చిధ్రమాయా ..
ఆశలు అడియాసలాయా ..కళ్ళు కన్నీరాయా...
సృజన సొలసిపోయా ..అవార్డులు అందలమాయా..
సినెమా చిత్రమాయా ...జీవితం విచిత్రమాయా...
చెప్పుకొంటే సిగ్గాయా ..లేకపోతే వేదనాయా ...
నా కథ కవితాయా ...కవిత విమర్శాయా ...
విమర్శ ఇంధనమాయా ..ఇంధనం ధరాయా ..
రచన చాటంతాయా ....ఇక వుంటానయా ...సారమింతేనయా...!


మహాత్మా ...మా ఆత్మా.....!


HAPPY BIRTHDAY TO U మహాత్మా ...మా ఆత్మా.....!

ఓ జాతి పిత మహాత్మా ...,బోసినవ్వుల బాపూజీ ..ఈ రోజు నీ జయంతి...ముందుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు .నువ్వు రాత్రి కలలోకి వచ్చి టైం గాని టైం లో ..దేశం ఎలావుంది ప్రజలు ఎలావున్నారంటే ఏం చెప్పను .. అప్పటి వరకు ఫేస్ బుక్ లో చాట్ చేసి అప్పుడే పడుకొన్నా ..ఏమీ అనుకోవద్దు ..అయినా నువ్వేమనుకొంటావులే ..నువ్వు మాలాగా కోపిష్టి,అవేశ పరుడివి కాదు కదా ..అందుకే ఇప్పుడు ఫోన్ చేస్తున్నా ..సరే విషయానికి వద్దాం ..నీ సమయం వృధా చేయడమెందుకు నువ్వు స్వర్గం లో వున్నా ఏదో ఒక మంచి పని చేస్తుంటావ్ కదా కాలక్షేపమేరుగవు నీవు మాలాగా ...!

టూకీ గా చెప్తా విను విధాతా..!

ఇప్పుడు దేశం వెలిగిపోతోంది సూర్యకాంతి వల్ల.. అంతే.. అభివృద్దిలో మాత్రం కరిగిపోతోంది..!

జనాభా కంటే అవినీతి రెండింతలు పెరిగింది ..దానికి వ్యతిరేకంగా పోరాడింది మాత్రం ఒక్కడే.. అన్నాహజారే అని ..మీ తరం మనిషే ..!

ఒక వైపు జైళ్ళు నిండుతున్నా ..మరోవైపు జేబులు నిండా దండుకొంటున్నారు రాక్షసులు.. సారీ రాజకీయనాయకులు...వాళ్ళు వింటే నా చమడాలు వొలుస్తారు..అసలే ఫోన్ టాపింగ్ లూ ఎక్కువయ్యాయి.

ఒకప్పుడు మీరు తెల్లదొరలను పారద్రోలి మాకు సేచ్చను ప్రసాదించారు ..ఇప్పుడు మేము అక్కడికి వెళ్లి బానిసలుగా మారాం బ్రతుకుదేరువుకోసం ...ఇక్కడ మేము చదివిన చదువులు ఇతరదేశాల అభివృద్దికి తోడ్పడుతున్నాయి ..పాపం మన వాళ్ళ దీ తప్పులేదు లే ..అవకాశాలుంటే అక్కడికి ఎందుకు పోతారు.

ఇక సామాన్యుడి జీవితం వర్ణనాతీతం..పప్పు ,ఉప్పు కోసం అప్పుచేసినా అందని ఎత్తులో వున్నాయి .

పాలకులు పాదాక్రాంతులు గా మారి అమ్మవారి సేవలో తరిస్తున్నారు .
.
వెనకల మీ పేరున్న గాంధీ లే ..కానీ వారి వాదం అవకాశవాదం .

ఇక దేశం ఎన్నో ముక్కలగా తయారవుతోంది ..బర్త్ డే కేక్ లా..మళ్ళీ వచ్చే జన్మదినానికి ఎన్ని ముక్కలు కావాలో చెప్పండి పంపిస్తాం.

అందరూ మీ పేరు చెప్పుకొనే అహింసావాదులే ..మరిజరుగుతున్న హింస ఎవరు చేస్తున్నారో ..మరి ..!

నిత్యం బందులు ,మారణహోమాలు ...ఉగ్రవాదులు ఎంతోనయం మననాయకులు కంటే ..వాళ్ళది మతోన్మాదమైతే ..వీరిది స్వార్తోన్మాదం..!

ఇక వార్తాప్రసారాలు నీతి ,నియమాలను గాల్లోకి వదిలేసాయ్ 24 ఘంటలంటూ ..!

ఇవ్వన్నీ చెప్పి నీ మనసును గాయపరచానా బాపూ ..మరి ఏంచేయ్యను ఈ పాపులను ..? కాసేపట్లో చూడు నాయకులు నీ ఫోటో కు పూలదండ వేసి ,నీ ముందు ఆస్కార్ నటనను ప్రదర్శిస్తారు .

కానీ ఒక్కటి మాత్రం నిజం.. నువ్విచ్చిన స్వేఛ్చ ,స్వాతంత్య్రం మాత్రం నిండుగా మా మనసుల్లో నిలిచిపోయింది .నువ్వే దిక్సూచి అంటూ ప్రపంచం మొత్తం నీకు నీరాజనాలు అర్పిస్తోంది .

నేను నీ బర్త్ డే సందర్బంగా ఒకటే కోరుతున్నా ..నువ్వు మళ్లీ జన్మించవా మా కోసం.. నీ దేశం కోసం.

HAPPY BIRTHDAY TO U మహాత్మా ...మా ఆత్మా.....!

Saturday, February 18, 2012


భూమికూడ తిరుగుతోంది కాని, మనకు కళ్ళు తిరుగేలా కాదు,మన అతివేగానిక భూమికి కళ్ళతిరిగి మనం కళ్ళు మూస్తున్నాం.. అతివేగం నీదైతే గమ్యం మపురి.